Modi Death Threat | మోదీని కాల్చిచంపేస్తా..  సీజేపీ ఆందోళనలో యువకుడి అనుచిత వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళన సందర్భంగా ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశాడు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Death Threat | ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళన సందర్భంగా ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశాడు. మోదీ తనకు దొరికితే వదిలిపెట్టనని, కాల్చి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా, అత్యంత అసభ్యకరమైన భాషలో బూతులు తిడుతూ, ప్రధాని తల్లిని కూడా దూషించాడు. ఈ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని, ఇలాంటి అంతులేని దురుసు ప్రవర్తన వల్ల అసలైన విద్యార్థుల ఉద్యమం పక్కదోవ పడుతుందని మండిపడుతున్నారు.

Modi Death Threat | శాంతియుతంగానే నిరసనలు..

మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ.. తాము దేశభక్తులమని, నిరసనలను పూర్తిగా శాంతియుతంగానే తెలుపుతున్నామని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద మాత్రమే తాము నిరసనలు తెలుపుతున్నామని, సీజేపీ పేరుతో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ తాము ఎలాంటి ఎదురుదాడికి దిగకుండా సంయమనం పాటిస్తున్నామని ఆయన వెల్లడించారు.


ఇది కూడా చదవండి:  Generic Drug Tariffs | జెనరిక్​ మందులపై సుంకాలు.. ట్రంప్​ సంచలన ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *