Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Allegations | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్ (BRS)​, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వారి తప్పులను ప్రశ్నిస్తున్నందుకు కొడంగల్​లో కాంగ్రెస్​కు ఓటు వేసిన వారి ఓట్లను తొలగిస్తున్నారన్నారు.

సీఎం రేవంత్​రెడ్డి బుధవారం కొడంగల్​లో తన ఎన్యుమరేషన్​ ఫారం నింపి బీఎల్​వోకు అందించారు. అనంతరం ఆయన బీఎల్​వోలతో సమావేశం నిర్వహించారు. రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదన్నారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని పేర్కొన్ఆనరు. పేర్లు వేరైనప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్​ కలిసి పనిచేస్తున్నాయన్నారు.

Revanth Reddy Allegations | సంక్షేమ పథకాలు అందవు

కొడంగల్‌ (Kodangal)లో ఇప్పటివరకు 1,96,620 ఓటర్ల ధృవీకరణ ఫారమ్‌ల ప్రక్రియ పూర్తయిందని సీఎం తెలిపారు. అర్హులైన 54,635 మంది ఓటర్లు ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఎన్యుమరేషన్​ ఫారాలు నింపి బీఎల్​వోలకు అందించాలని కోరారు. లేకపోతే ఓటు హక్కు పోతుందన్నారు. ఓటు హక్కు లేకపోతే సంక్షేమ పథకాలు అందవని పేర్కొన్నారు.

Revanth Reddy Allegations | మహిళలదే ఆధిపత్యం

రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలదే పూర్తి ఆధిపత్యం అని సీఎం అన్నారు. స్థానిక నిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించిన మహిళలకు, త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్‌లలోనూ 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయని వెల్లడించారు. పురుషులు బాధ్యతగా పనిచేయకపోతే ఇళ్ల వద్దే ఉండి వంట చేసుకోవాల్సి వస్తుందన్నారు.

Revanth Reddy Allegations | సీఎం నిరసన

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల మంగళవారం అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Generic Drug Tariffs | జెనరిక్​ మందులపై సుంకాలు.. ట్రంప్​ సంచలన ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *