అక్షరటుడే, కామారెడ్డి: Lakshmikant Rao | ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన చర్యను ఖండిస్తూ బుధవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Lakshmikant Rao | గుండాలకు పోలీస్ యూనిఫామ్ వేయించి..
అంతకుముందు పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా గుండాలకు పోలీస్ యూనిఫామ్ వేయించి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య దేశంలో కొనసాగడానికి వీల్లేదని, ఈ విషయాన్ని ప్రతి పౌరుడు గమనించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఘనీయమైనదని, కానీ మోదీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంలా మారిందని ఆరోపించారు. నీట్ పరీక్ష పత్రాల లీక్ తో విద్యార్థులు ఆందోళనకు గురై తమ బాధను ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన రూపంలో తెలియజేసినా దానిని సరిగా అర్థం చేసుకోకుండా టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, పట్టణ అధ్యక్షుడు సందీప్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా