అక్షరటుడే, వెబ్డెస్క్ : Gig Workers Issues | గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని కోరారు.
హైదరాబాద్ నగరంలో గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె చేపట్టారు. దీంతో ఆయా సంస్థల సేవలు నిలిచిపోయాయి. వారి సమ్మెకు కవిత (Kalvakuntla Kavitha) మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Gig Workers Issues | రేట్లు పెంచాలి
మూడేళ్లుగా రేట్లు పెంచాలని గిగ్వర్కర్లు అడుతున్నప్పటికీ సంస్థలు పట్టించుకోవటం లేదని కవిత పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. వాళ్లకు మంచి రేట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Comments | కొడంగల్ పర్యటన ముగింపు…. కేంద్రంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు