అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha New Party | ఇన్నాళ్లు రాష్ట్రంలో పిట్టలదొరను చూశామని.. ఇప్పటి నుంచి పిట్టల దొరసానిని చూస్తామని ఎంపీ అర్వింద్ (MP Arvind) కవితపై సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లోని (Hyderabad) పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ (Kavitha party) పెట్టడంపై ఆయన స్పందించారు.
Kavitha New Party | బీఆర్ఎస్ హ్యాంగోవర్లోనే కవిత..
బీఆర్ఎస్ (BRS) నుంచి కవిత వైదొలిగినప్పటికీ ఇంకా ఆమె బీఆర్ఎస్ హ్యాంగోవర్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలను గుర్తించకుండా ఆమె మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తోక పార్టీనే టీఆర్ఎస్ అని.. కవితను బీజేపీ (BJP) ఎప్పుడో మరిచిపోయిందన్నారు. ప్రత్యేకంగా ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ వచ్చినా బీజేపీని ఏమి చేయలేవన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టి వాళ్లను ఓడించి.. బీజేపీని ప్రజలు గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అన్నారు. కవితకి కేసీఆర్ రజనీకాంత్‌లా కనబడుతున్నారా? కేసీఆర్ రోబో అయ్యారా..? అర్వింద్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కవిత ప్రారంభించబోయే కొత్త పార్టీ రాజకీయ అస్తిత్వంపై అనేక అనుమానాలున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: TRS Panchajanyam | తెలంగాణ రాష్ట్ర సేన ‘పాంచజన్యం’.. ఐదు హామీలతో కవిత మార్క్ పాలిటిక్స్!

