Akhanda Rudrabhishekam | భక్తిశ్రద్ధలతో 72 గంటల అఖండ రుద్రాభిషేకం

బోధన్​ పట్టణంలో 72 గంటల పాటు నిర్వహించిన అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Akhanda Rudrabhishekam | పట్టణంలోని (Bodhan) బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో ఉన్న దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయంలో (Anjaneya Swamy Temple) అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది. 72 గంటల పాటు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Akhanda Rudrabhishekam | వర్షాలు కురవాలని..

రాష్ట్రంలో (Telangana) వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగుండాలని సంకల్పంతో 72 గంటల పాటు అఖండ రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో నిరసనల వేళ.. కేంద్రం కీలక నిర్ణయం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *