అక్షరటుడే వెబ్‌డెస్క్: Priyanka Gandhi Demands | నీట్ పేపర్ లీక్ ఘటనలు, చలో పార్లమెంట్ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై ( Narendra Modi )ఘాటు విమర్శలు చేసారు.
Priyanka Gandhi Demands | దాదాపు 152 పేపర్ లీకేజీలు..
దేశ యువత ఏ రంగంలో విజయం సాధించినా ఆ క్రెడిట్ అంతా ప్రధాని మోదీ తన ఖాతాలో వేసుకుంటారని, మరి దేశంలో జరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యార్థులపై దాడులకు ఎందుకు బాధ్యత వహించరని ప్రియాంక ప్రశ్నించారు. మోదీ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 152 పేపర్ లీకేజీలు జరిగాయని, వీటికి బాధ్యులెవరని నిలదీశారు.
Priyanka Gandhi Demands | ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని..
అధికార పక్షానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ బయట నిల్చొని ఆందోళన చేయడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించిన ఆమె.. పార్లమెంట్ సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. మనం అసలు ప్రజాస్వామ్యంలోనే జీవిస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు (విద్యార్థులు) ఆందోళన చేస్తుంటే ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని, వాళ్లు ఉగ్రవాదులు కాదని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై బాష్పవాయువు ప్రయోగించి, ఇష్టమొచ్చినట్లుగా లాఠీలతో కొట్టించారని ఆరోపించారు.
Priyanka Gandhi Demands | ప్రియాంక గాంధీ డిమాండ్..
క్రీడల్లో పతకాలు సాధిస్తే.. తన వల్లే వచ్చిందని ఆ క్రెడిట్‌ను మోదీ తన ఖాతాలో వేసుకుంటారని, అంగారకుడిపైకి వెళ్లినా, రాకెట్లు ప్రయోగించినా వాటినీ తన ఖాతాలోనే వేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఇన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న ప్రధాని మోదీ.. దేశంలో జరుగుతున్న పేపర్ లీక్‌లు, ప్రస్తుతం విద్యార్థులపై జరుగుతున్న దాడులకు కూడా పూర్తి బాధ్యత వహించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: KTR Legal Notice | అవినీతిపై సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా?: కేటీఆర్