అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy | విద్యార్థులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ( Delhi )మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తుక్డే గ్యాంగ్‌లు జంతర్ మంతర్ వద్ద చేరి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
Kishan Reddy | కాంగ్రెస్‌పై విమర్శలు..
కాంగ్రెస్ హయాంలోనూ అనేకసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. నాడు రాజీనామాలు చేయకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రాజీనామా కోరే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి విదేశాలకు వెళ్లే రాహుల్ గాంధీ తమను రాజీనామా అడగడం హాస్యాస్పదమని విమర్శించారు. కాంగ్రెస్‌కు విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాదని, కేవలం రాజకీయ లబ్దే ముఖ్యమని మండిపడ్డారు.
Kishan Reddy | తెలంగాణ నేతల తీరుపై మండిపాటు..
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి గుర్తుందా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు పలుమార్లు లీకయ్యాయని, అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు తమకు హితబోధ చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
Kishan Reddy | కేంద్రం తీసుకున్న చర్యలు..
నీట్ పరీక్ష విషయంలో తప్పు జరిగిందని అంగీకరించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే రీ-ఎగ్జామ్ నిర్వహించినట్లు తెలిపారు. పేపర్ లీక్ ఘటన వెలుగులోకి రాగానే కేంద్రం వెంటనే స్పందించి 17 మందిని అరెస్టు చేసిందని గుర్తుచేశారు. అత్యంత పకడ్బందీగా రెండోసారి పరీక్ష నిర్వహించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: CJP Protest | సీజేపీతో మరోసారి చర్చలకు సిద్ధం.. కేంద్రం కీలక ప్రకటన