అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Krishna River Flood | ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద మొదలైంది. కృష్ణమ్మకు జలకళ మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వానాకాలం ప్రారంభం అయి 55 రోజులు అవుతోంది. అయినా కూడా తెలంగాణ (Telangana)లోని ప్రధాన జలాశయాలకు వరద రావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి భారీ వరద వస్తోంది. దీంతో ఆల్మట్టి జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
Krishna River Flood | 88 వేల క్యూసెక్కులు
ఆల్మట్టి డ్యామ్‌కు ప్రస్తుతం 88,228 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 67,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 123 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 108 టీఎంసీల నీరు ఉంది. దీంతో త్వరలో ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. మరోవైపు నారాయణపూర్ జలాశయానికి 67 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 37,075 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు అవుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 33 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 31.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Krishna River Flood | త్వరలో జూరాలకు వరద..
కర్ణాటక ఘాట్ ప్రాంతాల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచానా వేశారు. రాబోయే 10 రోజుల్లో జూరాల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ఘాట్ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే ఆగస్టు మూడో వారంలో శ్రీశైలానికి కూడా వరదలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 137 టీఎంసీలు, శ్రీశైలంలో 41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్థానికంగా కురిసిన వర్షాలతో సాగర్‌లోకి 19 టీఎంసీలు, శ్రీశైలంలోకి 6 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది.
ఇది కూడా చదవండి..: Rajagopal Reddy Counter | మందుల సామేల్‌ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్‌రెడ్డి