అక్షరటుడే, నిజామాబాద్సిటీ: High Court Judges | జిల్లా పర్యటనకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
High Court Judges | గౌరవ వందనం స్వీకరించి..
హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, సీపీ, అదనపు కలెక్టర్ తదితరులతో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో వివిధ అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి..: Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్పాల్