Kl Rahul | రాహుల్ రాకెట్ ఇన్నింగ్స్ .. 152 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త మైలురాయి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kl Rahul | ఐపీఎల్ 2026 సీజన్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ KL Rahul బ్యాట్ నుంచి అద్భుత ఇన్నింగ్స్ వ‌చ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రాహుల్, పంజాబ్ కింగ్స్ బౌలర్లను చిత్తుగా కొడుతూ 152 పరుగుల భారీ స్కోరు నమోదు చేశాడు. ఆయన దూకుడైన బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిన రాహుల్, మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో అద్భుతమైన షాట్లు ఆడుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 220కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆయన బ్యాటింగ్ చేయడం విశేషం.

Kl Rahul | తొలి భార‌తీయ బ్యాట‌ర్..

ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ ఐపీఎల్ IPL చరిత్రలో 150కి పైగా స్కోరు చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను కేవలం ఇద్దరు విదేశీ దిగ్గజాలు మాత్రమే సాధించారు.క్రిస్ గేల్ (175*) మరియు బ్రెండన్ మెకల్లమ్ (158*). ఇప్పుడు రాహుల్ కూడా వారి సరసన చేరి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇది ఈ సీజన్‌లో రాహుల్‌కు రెండో సెంచరీ కాగా, మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో ఆరో శతకం. దీంతో అతను క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ (8), జోస్ బట్లర్ (7) మాత్రమే రాహుల్ కంటే ముందున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్రలో వేగవంతమైన శతకం

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals చరిత్రలో వేగవంతమైన శతకంగా కూడా రాహుల్ రికార్డు సృష్టించాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, క్వింటన్ డి కాక్ (48 బంతులు, 2016) రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో వీరేందర్ సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు నమోదుచేసిన రికార్డులను అధిగమించడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్ విమర్శకుల నోళ్లకు తాళం వేసినట్టయ్యింది. ఇటీవల ఆయన స్ట్రైక్ రేట్, నిలకడపై వచ్చిన విమర్శలకు ఈ ఇన్నింగ్స్ సమాధానమిచ్చింది. పవర్‌ప్లే తర్వాత కూడా దూకుడు తగ్గించకుండా చివరి వరకు అదే జోరు కొనసాగించడం ఆయన క్లాస్‌కు నిదర్శనం. రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోనుంది. ఇదే ఫామ్ కొనసాగితే, ఈ సీజన్ ముగిసేలోపు మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: IPL Records | ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. గేల్ రికార్డ్ చెరిపేసిన సుద‌ర్శన్, కోహ్లీ అరుదైన మైలురాళ్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *