అక్షరటుడే, వెబ్డెస్క్ : Medak Leopard Death | రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లా హవేలి ఘన్పూర్ మండలం గంగాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
గంగాపూర్, శమ్నాపూర్, లక్ష్మాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం ఉదయం రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొంది. దీంతో అది అక్కడికక్కడే చనిపోయించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Medak Leopard Death | మూడేళ్ల చిరుత
మృతి చెందిన చిరుతను జిల్లా ఫారెస్ట్ అధికారి జ్యోతి, రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, ఇతర సిబ్బంది పరిశీలించారు. సుమారు మూడేళ్ల వయసు గల ఆడ చిరుత చనిపోయినట్లు గుర్తించారు. అనంతరం కళేబరాన్ని అర్బన్ పార్క్ వద్దకు తరలించారు. అక్కడ పోస్టు మార్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపడుతామని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Mann Ki Baat | కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ