Hormuz Strait Talks | హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు

హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hormuz Strait Talks | హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్, ఒమన్ ( Oman )దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు. టెహ్రాన్ వేదికగా ఇరు దేశాల డిప్యూటీ విదేశాంగ మంత్రులు రెండు రోజుల పాటు ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరిపారు. సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా, వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా సాంకేతిక, రాజకీయపరమైన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. అమెరికా దాడులు నిలిపివేయడంతోనే ఒమన్‌తో ఈ చర్చలు మళ్లీ పురోగతి సాధించాయని పేర్కొన్నారు.

Hormuz Strait Talks | వివాదం వెనుక అసలు కారణం..

హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు సేవా రుసుములు వసూలు చేసే అంశంపై చర్చిస్తామని ఇరాన్, ఒమన్ గత జూన్‌లోనే ప్రకటించాయి. అయితే దీనిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో తాత్కాలిక ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే వివాదం మళ్లీ మొదలైంది. హర్మూజ్‌పై పట్టు కోసం అమెరికా దాడులకు దిగగా.. ఇరాన్ సైతం గట్టిగా ప్రతిఘటించింది. తమ అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా ఆ మార్గంలో వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ హర్మూజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికా ఒత్తిడితో ఒమన్‌ తీరం గుండా నౌకలను మళ్లించేందుకు ఏర్పాట్లు జరగగా, ఇరాన్ హెచ్చరికలతో ఒమన్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు నిలిపివేయడంతో టెహ్రాన్, మస్కట్ మధ్య చర్చలకు మార్గం సుగమమైంది. మరోవైపు, నల్ల సముద్ర ఓడరేవులకు వెళ్లే నౌకల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Chandrababu Warning | వైసీపీ గొడ్డలి పార్టీ విష వృక్షం లాంటిది: సీఎం చంద్రబాబు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *