SRSP Backwaters Tragedy | ఎస్సారెస్పీ బ్యాక్​వాటర్​లో విషాదం.. గల్లంతైన నలుగురిలో ఇద్దరు మృతి

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ పరిధిలో విషాదం నెలకొంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: SRSP Backwaters Tragedy | శ్రీరాంసాగర్ (Sriram Sagar Projec)​ ప్రాజెక్ట్​ పరిధిలో విషాదం నెలకొంది. బ్యాక్​ వాటర్​లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఐదుగురు యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు.

SRSP Backwaters Tragedy | ప్రమాదకరమైన గుంతల్లో..

నిజామాబాద్​కు(Nizamabad) చెందిన ఐదుగురు యువకులతో ఓ బృందం ఆదివారం ఉదయం బ్యాక్​వాటర్​ పరిసరాల్లో సరదాగా గడిపేందుకు వచ్చింది. యువకులంతా నీళ్లలో స్నానానికి దిగిన అనంతరం నలుగురు యువకులు గుంతల్లో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. మిగితా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ జాన్​రెడ్డి, ముప్కాల్​ ఎస్సై కిరణ్​కుమార్​, మెండోరా సుహాసిని సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి : #BREAKINGNEWS : ఎస్సారెస్పీలో నలుగురి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *