Esha Singh Gold | కామన్​వెల్త్ గేమ్స్​లో భారత్​కు మరో స్వర్ణం

కామన్​వెల్త్​ గేమ్స్​లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఈషాసింగ్​ బంగారు, మను బాకర్​ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Esha Singh Gold | కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. సోమవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్​ (Hyderabad)కు చెందిన ఈషా సింగ్​ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌ను ఆమె ఓడించడం గమనార్హం.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి తన సంయమనాన్ని కోల్పోకుండా పోడియంపై అగ్రస్థానంలో నిలవగా, మను తీవ్రంగా పోరాడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్​కు షూటింగ్​లో రెండు పతకాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ దశలోనే భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పతకాల కోసం పోటీ మొదలయ్యాక, ఈషానే అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్ ఆద్యంతం నిలకడగా ఆడిన ఆమె, 40 హిట్స్ నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Esha Singh Gold | రెండో స్వర్ణం..

కామన్​వెల్త్​ గేమ్స్​లో మీరాబాయి చాను భారత్​కు తొలి బంగారు పతకాన్ని అందించింది. వెయిట్​ లిఫ్టింగ్​లో ఆమె సత్తా చాటి గోల్డ్​ మెడల్​ సాధించారు. తాజాగా ఈషా సింగ్​ రెండో బంగారు పతకాన్ని భారత్​ ఖాతాలో వేశారు. షూటింగ్​లో ఒకే విభాగంలో భారత్​ రెండు పతకాలు గెలుచుకోవడం గమనార్హం. ఈషా సింగ్​, మను భాకర్​ను పలువురు అభినందించారు.

ఇది కూడా చదవండి..: Anti Paper Leak Bill | లోక్​సభ ముందుకు.. యాంటీ పేపర్​ లీక్​ సవరణ బిల్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *