అక్షరటుడే, ఇందూరు: Handloom Workers Welfare | జిల్లాలో(Nizamabad) చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి (Gujja Rajeswari) పేర్కొన్నారు. ఇటీవల సంఘానికి ఎన్నికలు జరగగా సోమవారం పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది.
Handloom Workers Welfare | పూర్వవైభవం తీసుకొస్తాం
సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరి పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. సంఘం మాజీ అధ్యక్షుడు గుద్దేటి రామకృష్ణ రాజేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చేనేత రంగానికి(Telangana Handlooms) పూర్వ వైభవం తెచ్చేలా పాటుపడతానన్నారు. చేనేత సంఘం ప్రధాన కార్యదర్శి పెంటి రాజు, కోశాధికారి నందాల నరేష్, డైరెక్టర్లు దిండిగల్ల శంకర్, కైరంకొండ బాల్ రాజ్, కారంపూరి ప్రభు, గాలిపల్లి అరుణ సైతం బాధ్యతలు స్వీకరించారు.
కార్యక్రమంలో చేనేత సంఘం ఎన్నికల అధికారి పోశన్న, పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, గౌరవ సలహాదారులు రాపెల్లి గురుచరణ్, నగర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కన్న దుబ్బ రాజం, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, నగర సంఘం మాజీ అద్యక్షుడు ఎస్సార్ సత్యపాల్, చేనేత సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సబ్బని ప్రసాద్, జిల్లా సంఘం ప్రతినిధులు లక్కవత్రి దేవిదాస్, బింగి ధర్మవీర్, చింతల గంగాదాస్, గుజ్జ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.