అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Water Wastage Fine | హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాగునీటి వృథా, రోడ్డపైకి నీరు వదలడం వంటి పనులు చేస్తే జలమండలి (HMWSSB) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
సాధారణంగా ప్రజలు నీటిసంపులను శుభ్రం చేసే సమయంలో ఆ నీటిని బయటకు పంపిస్తారు. అలా రోడ్డు మీదకు నీటిని వదిలి ప్రజల ఇబ్బందులకు కారణమై ఓ సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని వెంకటేశ్వర కాలనీ వార్డు జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో కె. స్వరూప్ కుమార్ రెడ్డి ఆధీనంలోని “ఐషా రావు బ్రైడల్ వేర్”కు ఫైన్ వేశారు.
Water Wastage Fine | మురుగు నీరు నిలవడంతో..
సదరు సంస్థ సంపు శుభ్రపరిచే పనులను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తుంది. వెలువడిన మురికి నీటిని నేరుగా రోడ్డుపైకి విడుదల చేయడంతో డ్రైనేజీ వ్యవస్థ ఒక రోజు పాటు చోకేజితో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఈ మేరకు జలమండలి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంపు శుభ్రపరిచే పనుల్లో ఉపయోగించిన డీవాటరింగ్ సబ్‌మర్సిబుల్ పంపు సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ప్రతినిధులు, సంబంధిత ఏజెన్సీకి భవిష్యత్తులో సంపు శుభ్రపరిచే సమయంలో మురికి నీటిని రోడ్లపైకి విడుదల చేయకుండా, జలమండలి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : NEET Protest Cases | కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ ఉద్యమం.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం