అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bladder Stone Surgery | ఎల్లారెడ్డిలోని (Yellareddy) వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.
Bladder Stone Surgery | నిజాంసాగర్ మండలంలో..
నిజాంసాగర్ (Nizamsagar) మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిళ (39) కు యూరినరీ సమస్యలతోపాటు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చారు.
ఆమెకు డాక్టర్ నాగేశ్వరరావు పరీక్షలు నిర్వహించగా.. యూరినరీ బ్లాడర్లో సుమారు 400 గ్రాముల భారీ రాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సోమవారం ఉదయం రోగికి శస్త్రచికిత్స నిర్వహించి, బ్లాడర్లోని పెద్ద రాయిని విజయవంతంగా తొలగించారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. తగినంత నీరు తాగకపోవడం, ఆహార అలవాట్ల వల్ల ఇలాంటి పెద్ద రాళ్లు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: #KJQ Trailer Out Now