అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అమెరికా, ఇరాన్‌ల మధ్య నిరంతర సంఘర్షణల నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కడంతో దీని ప్రభావం మన మార్కెట్‌పైనా కనిపిస్తోంది.
Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మంగళవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 126 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 283 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 9 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 79 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 76,730 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 29,978 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ 4.74 శాతం, టెక్ మహీంద్రా 3.43 శాతం, ఎటర్నల్ 3.11 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.09 శాతం, ఇన్ఫోసిస్ 2.59 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌యూఎల్ 4.95 శాతం, బీఈఎల్ 2.82 శాతం, ఎన్టీపీసీ 1.84 శాతం, పవర్‌గ్రిడ్ 1.33 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.02 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: July 28 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు