Car Fire | నడుస్తున్న కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Car Fire | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని PVNR ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం వైపు వెళ్లే మార్గంలో, PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 278 వద్ద ఒక కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.

రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, మంటలు వ్యాపించకముందే వాటిని ఆర్పేశారు. పోలీసులు వేగంగా స్పందించడంతో కారులో ఉన్నవారు, ఇతర వాహనదారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు.

Car Fire | కారు ఢీకొనిఒకరు మృతి

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతారం గ్రామానికి చెందిన జమలుద్దీన్​ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో చనిపోయాడు. లక్ష్మాపూర్‌కు చెందిన వ్యక్తి నడుపుతున్నట్లుగా చెబుతున్న ఆ కారు, బాధితుడిని అత్యంత వేగంతో ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: CI Suspended | మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *