అక్షరటుడే, బాన్సువాడ: Rajaram Dubba Cordon | పట్టణంలోని రాజారాం దుబ్బలో బుధవారం ఉదయం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ వందలాది మంది పోలీసు సిబ్బంది కాలనీలోకి ప్రవేశించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Rajaram Dubba Cordon | 140 మంది పోలీసులు..
ఈ కార్డన్ సెర్చ్‌లో 140మంది పోలీసులు పాల్గొన్నారు. దీంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కార్డన్ సెర్చ్ (Cordon search)లో భాగంగా రాజారాం దుబ్బ ప్రాంతంలోని ప్రధాన రహదారులు, కాలనీకి వెళ్లే మార్గాలు, గల్లీల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాలనీని పూర్తిగా చుట్టుముట్టిన వారు ఇళ్లల్లో, రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని కొన్ని వాహనాల వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో కాలనీలోని దుకాణాలు, ఇళ్లను కూడా పోలీసులు తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను విచారించారు.
Rajaram Dubba Cordon | గంజాయి.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాలు వంటి సామాజిక రుగ్మతలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కాలనీకి మంచి పేరు తీసుకురావడంలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డన్ సర్చ్ ద్వారా కాలనీలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టవచ్చని డీఎస్పీ తెలిపారు. ఈ సెర్చ్‌లో 112 బైక్‌లు, 5 కార్లు, 19 ఆటోలను తనిఖీ చేసి 13 బైక్‌లు, 1 ఆటోను సీజ్ చేశారు. సీఐ తుల శ్రీధర్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kalyani Project Flood | కళ్యాణి ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. రెండు గేట్లు ఎత్తివేత