Stock Market Rally | ఐటీ సెక్టార్‌లో దూకుడు.. భారీ లాభాల్లో సూచీలు

ఐటీ, మెటల్ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఉదయ 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం పరుగులు తీస్తోంది. బెంచ్ మార్క్ సూచీలను ఐటీ సెక్టార్ ముందుండి నడిపిస్తోంది. ఏఐ రిలేటెడ్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్.. మన ఐటీ కంపెనీలకు సానుకూలంగా మారింది. దీంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. గత సెషన్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికర కొనుగోలుదారులుగా నిలవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడడమÖ మార్కెట్ పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.

Stock Market Rally | భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 708 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 90 పాయింట్లు తగ్గినా.. అక్కడినుంచి మరో 313 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 191 పాయింట్ల భారీ లాభంతో మొదలై ప్రారంభంలో 40 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని మరో 108 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయ 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 813 పాయింట్ల లాభంతో 77,579 వద్ద, నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 24,227 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 స్టాక్స్ లాభాలతో, 10 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 4.68 శాతం, హెచ్యూఎల్ 4.52 శాతం, టాటా స్టీల్ 3.07 శాతం, ఎల్టీ 2.81 శాతం, టీసీఎస్ 2.34 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : అదానీపోర్ట్స్ 2.43 శాతం, పవర్‌గ్రిడ్ 1.42 శాతం, బీఈఎల్ 1.28 శాతం, ఎం అండ్ ఎం 0.79 శాతం, ఎన్టీపీసీ 0.55 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: July 29 Gold Prices | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..అదే బాటలో వెండి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *