జాతీయంMaoist surrender | లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

Maoist surrender | లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టుల లొంగిపోయారు. వారిలో పలువురు కీలక నేతలు ఉన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist surrender | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో 47 మంది మావోయిస్టుల లొంగిపోయారు. వారిలో పలువురు కీలక నేతలు ఉన్నారు.

హైదరాబాద్‌ (Hyderabad)లో తెలంగాణ పోలీసుల సమక్షంలో LMG, AK-47, SLR, INSAS రైఫిల్స్‌తో సహా 32 ఆయుధాలతో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో DKSZC సభ్యుడు, దక్షిణ బస్తర్ DVC ఇన్‌చార్జి హేమ్లా ఐతు అలియాస్ విజ, దక్షిణ బస్తర్ DVCకి చెందిన 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లాచు అలియాస్ మనోజ్ ఉన్నారు. మొత్తం 47 మంది మావోయిస్టులు శనివారం సరెండర్​ అయ్యారు. తెలంగాణ లొంగుబాటు, పునరావాస విధానం పట్ల ఆకర్షితులై మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.

Maoist surrender | ఖాళీ అవుతున్న బస్తర్​

మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులందరూ లొంగిపోయిన నేపథ్యంలో DKSZC పరిధిలోని దక్షిణ బస్తర్ (Bastar)​లో పార్టీ ఉనికి దాదాపుగా కనుమరుగు అయింది. దీంతో దక్షిణ బస్తర్ DVC ఇప్పుడు పూర్తిగా కుప్పకూలే దశకు చేరుకుందని పోలీసులు తెలిపారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో మావోయిస్ట్​ల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది ఎన్​కౌంటర్లలో చనిపోగా.. ఇటీవల పార్టీ సెక్రెటర్​ దేవ్​జీ సహా కీలక నేతలు లొంగిపోయారు. దీంతో మిగతా వారు సైతం అడవులను వీడుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ దాదాపుగా కనుమరుగు అయింది. అయితే అక్కడక్కడ మిగిలిపోయిన వారు సైతం తాజాగా లొంగిపోతున్నారు.

police 1

దీనిని కూడా చదవండి: Raghav Chadha | అవినీతిపరుల చేతుల్లో ‘ఆప్’.. అందుకే బయటకు వచ్చాం: రాఘవ్ చడ్డా

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...