అక్షరటుడే, వెబ్డెస్క్: Indo MIM IPO Listing | మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ (ఎంఐఎం) సాంకేతికతను ఉపయోగించి ఇంజినీరింగ్ భాగాలను తయారు చేసే ఇండో – ఎంఐఎం లిమిటెడ్ కంపెనీని 1996లో స్థాపించారు. ఇది ఆటోమోటివ్, రక్షణ, వైద్య, వినియోగదారు, ఏరోస్పేస్ రంగాల కోసం మోల్డ్ డిజైన్, టూలింగ్, ఫినిషింగ్, అసెంబ్లీలతో సహా పూర్తి స్థాయి సొల్యూషన్స్ అందిస్తుంది. ఈ సంస్థ ఫ్యుయల్ సిస్టమ్స్, పవర్ట్రెయిన్స్, ట్రిగ్గర్స్, హ్యామర్స్, సైట్స్, క్రాస్బోలు, సెల్ఫోన్ భాగాలు, టూల్స్, నాజిల్స్, లాకింగ్ రింగ్స్, క్లెవిస్లు.. ఇలా మరెన్నో ఉత్పత్తులను తయారు చేస్తుంది.
Indo MIM IPO Listing | భారీ స్పందన..
రూ. 3,811.21 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇండో ఎంఐఎం కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఐపీవో మొత్తం 72.37 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కాగా.. క్యూఐబీ కోటా 204.47 రెట్లు, ఎన్ఐఐ కోటా 50.65 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 6.69 sట్లు సబ్స్క్రైబ్ అయ్యింది.
Indo MIM IPO Listing | జీఎంపీకి మించి లాభాలు..
కంపెనీ షేర్లు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 485గా నిర్ణయించగా.. 44.33 శాతం ప్రీమియంతో రూ. 700 వద్ద ఎన్ఎస్ఈలో లిస్టయ్యాయి. బీఎస్ఈలో రూ. 703 వద్ద లిస్టయ్యింది. కాగా కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం 38 శాతంగా ఉంది. దానికి మించి ప్రీమియంతో కంపెనీ షేర్లు లిస్టవడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 53 శాతం లాభంతో రూ. 743 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి..: Stock Market Today | రేంజ్ బౌండ్లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు