Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్

విద్యాశాఖలో తాము తెస్తున్న సంస్కరణల పట్ల ఉపాధ్యాయ సంఘాలు కోపంగా ఉండాల్సిన అవసరం లేదని, ఉపాధ్యాయుల సమస్యలన్నీ తాను పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Education | విద్యాశాఖలో తాము తెస్తున్న సంస్కరణల పట్ల ఉపాధ్యాయ సంఘాలు కోపంగా ఉండాల్సిన అవసరం లేదని, ఉపాధ్యాయుల సమస్యలన్నీ తాను పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సమస్యలు, ప్రమోషన్లు, బదిలీల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆ బాధ్యత పూర్తిగా తనదేనని హామీ ఇచ్చారు. ఇకపై ఉపాధ్యాయులు తమ కోసం కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, విద్యారంగ అభివృద్ధి కోసం తనతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Revanth Reddy Education | ఐదేళ్ల ప్రణాళికతో ..

గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని సీఎం గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం మీదేనని, అందుకే మీకోసమే పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ దేశాలు తెలంగాణ విద్యాశాఖ వైపు చూసేలా ఉపాధ్యాయ సంఘాలు ఒక పంచవర్ష ప్రణాళిక తరహాలో ప్రతిజ్ఞ బూని పనిచేయాలని కోరారు.

Revanth Reddy Education | ఒకటో తేదీనే జీతాలు..

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి ‘ఆఫ్ డే’ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను చర్చిస్తామని సీఎం వెల్లడించారు. జనవరి 2024 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సైతం ప్రతినెలా ఒకటో తేదీనే కచ్చితంగా జీతాలు అందేలా చేశామని తెలిపారు. ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడం సులభమేమో కానీ, ఉపాధ్యాయుల బదిలీలు అంత సులభం కాదని పేర్కొన్నారు.

Revanth Reddy Education | విద్యాశాఖపై విమర్శలకు సీఎం కౌంటర్..

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయంటే అది తాము తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరని, తాను ఆ శాఖ నుంచి తప్పుకోవాలని కొందరు విమర్శలు చేస్తున్నారని ప్రస్తావించారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం తెచ్చినందుకా? 30 వేల మందికి బదిలీలు ఇచ్చినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? తాను ఎందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కేవలం అధికారం కోసం కాదని, మానవతా దృక్పథంతోనే అని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Revanth Reddy | 2034 వరకు నేనే సీఎం : రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment
  • Promotions are pending for the last 7 years, many are retired without promotion even they have phd, many lecturers are incharge head and incharge principals in technical education.we are fighting for the last two years.CM is the education minister so we are unable to express our problems in technical education.There are many vacancies in head and principals. Most of the institutions are running without principal and head of the departmentd. Hundreds of applications we gave to principal secretary education madam.pl try to understand our problems.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *