అక్షరటుడే, మెండోరా: SRSP Flood Inflow | రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్( Sriram Sagar ) ప్రాజెక్ట్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. దీంతో రైతులు (Telangana Irrigation) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SRSP Flood Inflow | మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు..
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం.. రాష్ట్రంలోనూ వర్షాలు మోస్తరుగా కురుస్తుండడంతో తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో రూపంలో 35,654 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,066.30 అడుగుల వద్ద 17.662 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,077 అడుగుల వద్ద 37.632 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం దాదాపు 20 టీఎంసీల మేర నీటి నిల్వ తక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు ఖరీఫ్ సాగుకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 220 క్యూసెక్కులు కలిపి మొత్తం 751 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్