అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bandaru Festival Nizamabad | నిజామాబాద్ నగరంలో (Nizamabad) ఊరపండుగకు సంబంధించి గురువారం బండారు పోసే (Oora Panduga) కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
Bandaru Festival Nizamabad | వివేకానంద చౌరస్తా వద్ద..
వివేకానంద చౌరస్తా వద్ద ఊర పండుగను పురస్కరించుకుని బండారు పోసే కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోరడి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలు రోగాల బారిన పడకుండా, అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న ఊర పండుగకు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్పొరేటర్ మహేందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
2వ తేదీన జరిగే ఊర పండుగకు ప్రజలు విశేష సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు రామడుగు బాలకిషన్, ఆదె ప్రవీణ్, అన్నారం జితేందర్, బెల్లాల్ సాయినాథ్, సుంకటి విశాల్, అరుణ్, కొత్మీర్ సతీష్, కోరడి గోపి, అరవింద్, స్థానిక మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్