SRSP Flood Inflow | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 24 గంటల్లోనే ఐదు టీఎంసీలు చేరిక..

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా (బాల్కొండ): SRSP Flood Inflow | ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ (Sriramsagar Project)కు వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి వరద వస్తుండడంతో ప్రాజెక్ట్​లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

SRSP Flood Inflow | ఎస్సారెస్పీలోకి 60వేల క్యూసెక్కుల వరద..

24 గంటల వ్యవధిలో ప్రాజెక్టులోకి ఐదు టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇదే తరహాలో వరద నీరు వస్తే కొన్ని రోజులలో శ్రీరాం సాగర్ నిండుకుండగా మారనుంది. శ్రీరాంసాగర్ పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 22.053 టీఎంసీలకు చేరింది. గత యేడు ఇదే సమయానికి ప్రాజెక్టులు 1,077 అడుగులు (38 టీఎంసీలు)గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 65,422 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మిషన్ భగీరథ 231 క్యూసెక్కులు, ఆవిరి 291 క్యూసెక్కులు , కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తం822 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో నుంచి బయటకు వెళ్తోంది.

ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఆశాజనకంగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని 6 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Gambling Raid | నిజామాబాద్‌లో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడులు..ఆరుగురి అరెస్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *