Palle Dawakhana Services | పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Palle Dawakhana Services | పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. పట్టణంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Palle Dawakhana Services | రోగులతో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని..

ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన చికిత్స అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Adilabad Armur Railway Line | ఆదిలాబాద్, ఆర్మూర్ రైల్వే లైన్​కు డీపీఆర్​ పూర్తి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *