SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు రాక

ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: SRSP Ministers Visit | ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణ (Telanagana) వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్(Sriram Sagar Project) జలకళను సంతరించుకుంది. ఎల్​నినో ప్రభావంతో వానలు ఆలస్యం కావడంతో ప్రాజెక్ట్​ ఇన్నాళ్లు వెలవెలబోయింది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

SRSP Ministers Visit | మంత్రుల రాక..

​ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ఎస్సారెస్పీని సందర్శించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయం నుండి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు(SRSP) అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.

SRSP Ministers Visit | పర్యటన షెడ్యూల్ ఇలా..

ఇద్దరు మంత్రులు ఉదయం హెలిక్యాప్టర్​ ద్వారా ఉదయం 11గంటలకు మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ క్యాంప్​ ఆఫీస్​కు చేరుకుంటారు. ఉదయం 11.45 నుంచి 12.30వరకు ప్రాజెక్ట్​ను సందర్శిస్తాఉ. అక్కడి నుంచి హెలిక్యాప్టర్​లో నిర్మల్​ జిల్లాకు బయలుదేరుతారు. అనంతరం కడెం ప్రాజెక్ట్​ను సైతం సదర్శించనున్నారు. మధ్యాహ్నం 1:35 నుండి 2:20 వరకు కడెం ప్రాజెక్టును సందర్శిస్తారు. తిరిగి 3.10కు హెలికాప్టర్​లో పెద్దపల్లి జిల్లా గోలివాడ సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటారు. సాయంత్రం 3.50 నుండి 4.50వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి తనిఖీ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్​కు తిరిగి వెళ్లిపోనున్నారు.

ఇది కూడా చదవండి: షూటింగ్​లో నటి రష్మికకు గాయాలు 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *