Gangster Encounter | ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ హతం

జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్​ సుజిత్ సిన్హా ఎన్​కౌంటర్​లో హతం అయ్యాడు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gangster Encounter | జార్ఖండ్‌ (Jharkhand)లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన సుజిత్ సిన్హా ఎన్​కౌంటర్​లో హతం అయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్‌బాద్ జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకునే యత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు.

Gangster Encounter | పోలీసులపై కాల్పులు

పోలీసుల కథనం ప్రకారం, జైలు బదిలీ సమయంలో జామ్తారా సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్‌కు వెళ్లడానికి కాన్వాయ్‌ను ఆగాలని సిన్హా కోరినట్లు అధికారులు తెలిపారు. పోలీసు వాహనం ఆగగానే సుజిత్ ఎస్కార్ట్ సిబ్బందిలో ఒకరి వద్ద నుంచి రైఫిల్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. అంతేగాకుండా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో అధికారులు ఎదురు కాల్పులు జరపగా.. సిన్హాకు తీవ్రమైన బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Gangster Encounter | 60కి పైగా కేసులు

సుజిత్​ సిన్హాపై 60కి పైగా కేసులు ఉన్నాయి. హత్య, బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, ఆయుధ చట్టం ఉల్లంఘనలు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులు అతడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో దివంగత గ్యాంగ్‌స్టర్ సుశీల్ శ్రీవాస్తవ ముఠాతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత సొంత ముఠాను ఏర్పాటు చేసుకుని, జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో బలవంతపు వసూళ్లు, నేర కార్యకలాపాలను నిర్వహించాడు. చాలా కాలంగా పోలీసులకు సవాల్​గా మారిన అతడిని గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్​కౌంటర్​లో సిన్హా చనిపోయాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనల క్రమాన్ని సమీక్షించడంతో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సీల్ చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా, రాత్రి 10 గంటల నుండి సాహిబ్‌గంజ్-గోవింద్‌పూర్ హైవేపై ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇది కూడా చదవండి..: Brij Bhushan Acquitted | రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఊరట

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *