అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: POCSO Case Nizamabad | బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి నిజామాబాద్ (Nizamabad) జిల్లా న్యాయస్థానం 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.
POCSO Case Nizamabad | పోక్సో కేసు నమోదు కాగా..
నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన బింగి అంకుష్‌పై కేసు నమోదైంది. బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఫిర్యాదు రావడంతో 2020లో మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పటి ఎస్సై సంతోష్‌కుమార్ పోక్సో కేసు రిజిస్ట్రర్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరింపులకు గురిచేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (Addl. APP) ఎ.రాజా రెడ్డి, జి.నరసింహా రెడ్డి వాదనలు వినిపించి, నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సమర్పించారు. దీంతో నిజామాబాద్ పోక్సో (POCSO) ప్రత్యేక న్యాయస్థానం జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి డి. వరూధిని సోమవారం తీర్పు వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద ఏడేళ్ల జైలుశిక్ష రూ.పదివేల జరిమానా విధించారు. అలాగే పోక్సో యాక్ట్ సెక్షన్ 12 కింద ఐదేళ్ల జైలుశిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు నష్టపరిహారం ఇప్పించేలా కృషి చేయాలని న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేశారు.
ఇది కూడా చదవండి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్