Nizamsagar Inflow | నిజాంసాగర్‌కు పెరుగుతున్న వరద.. ఆశాజనకంగా నీటిమట్టం

ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో వరద క్రమక్రమంగా పెరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Inflow | ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (Nizamsagar Project)లో వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం సైతం పెరుగుతోంది.

Nizamsagar Inflow | 8,900 క్యూసెక్కుల ఇన్​ఫ్లో

బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405(17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1398.37 అడుగుల(9.690 టీఎంసీలు)కు చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 4.627 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేకపోవడంతో కేవలం ఆవిరిరూపంలో 166 క్యూసెక్కులు పోతోంది.

Nizamsagar Inflow | కళ్యాణి, సింగితం రిజర్వాయర్లలో..

కళ్యాణి ప్రాజెక్ట్​కు 100 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా, అంతే మొత్తాన్ని ఫ్లడ్​ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 408 మీటర్లుగా (పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల) ఉంది. ​సింగితం రిజర్వాయర్​లో పూర్తిస్థాయి నీటిమట్టానికి (416.550 మీటర్లు) చేరడంతో ప్రస్తుతం వస్తున్న 663 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను నిజాంసాగర్​ ప్రధాన కాలువకు మళ్లించారు.

ఇది కూడా చదవండి..: SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *