అక్షరటుడే, డిచ్పల్లి: Nizamabad Rural Congress | నిజామాబాద్ రూరల్‌ను కాంగ్రెస్‌కు శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇందల్వాయి మండల అధ్యక్షుడు చింతల కిషన్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన మండల కమిటీని అభినందించారు.
Nizamabad Rural Congress | పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి..
పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్ పార్టీ (Congress Party) భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా చైతన్యవంతమైన ఇందల్వాయి మండలంలో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, కష్టానికి తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి, కర్సా మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ‘నేను డాక్టర్ కాబట్టి సున్నితంగా ఉంటానని అనుకోవద్దు.. మంచివారికి మంచివాడిని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారి పక్షాన ఎప్పుడూ నిలబడతాను’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Nizamabad Rural Congress | రాహుల్‌గాంధీ నాయకత్వంలో..
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతోందని, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాయరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, నాయకులు నవీన్ గౌడ్, బాల్ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Interstate Theft Gang | పోలీసుల వలలో అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠా