Gram Panchayat Workers | జీపీ కార్యదర్శి నిర్లక్ష్యం.. కార్మికులకు అందని గౌరవ వేతనం

మూడు నెలల వేతనాలు అందకపోవడంతో గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Gram Panchayat Workers | గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా అందించే గౌరవ వేతనం సకాలంలో అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి బ్యాంక్​ ఖాతాల్లో వేతనం జమ చేస్తున్నప్పటికీ గతంలో మాన్యువల్​గా ఇవ్వాల్సిన గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Gram Panchayat Workers | బాన్సువాడ మండలం మొగులాన్​పల్లిలో..

బాన్సువాడ మండలం (Banswada Mandal) మొగులాన్ పల్లి తండా గ్రామపంచాయతీలో ముగ్గురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిశుభ్రత, డ్రైనేజీల శుభ్రపర్చే పనులు, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, తమకు రావాల్సిన గౌరవ వేతనం అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ప్రారంభానికి ముందు మాన్యువల్‌గా చెల్లించాల్సిన రెండు నుంచి మూడు నెలల గౌరవ వేతనాన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు కార్యదర్శిని సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని వారు తెలిపారు.

Gram Panchayat Workers | నెలవారీ వేతనంపైనే..

నెలవారీ వేతనంపైనే కుటుంబ జీవనం ఆధారపడిన తమలాంటి కార్మికులకు మూడు నెలల గౌరవ వేతనం నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, వైద్య అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: CMR Scam | మిల్లర్ల మాయాజాలం.. రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *