NEET CBT Exam | నీట్-యూజీ పరీక్షల్లో కీలక మార్పులు.. ఆన్‌లైన్ విధానంపై కేంద్రం కసరత్తు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET CBT Exam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి పలికి, భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత (CBT) ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు  ( Supreme Court )తెలిపింది. పేపర్ లీకేజీలు, ఇతర వ్యవస్థాగత లోపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.

NEET CBT Exam | జేఈఈ తరహాలో నిర్వహణ..

జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) పరీక్షల మాదిరిగానే, నీట్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఒకే విడతలో లేదా రెండు దశల్లో నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నందన్ నిలేకని నేతృత్వంలోని హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆన్‌లైన్ విధానానికి మారుతుంటే విద్యార్థులు ముందుగా సన్నద్ధమయ్యేలా వీలైనంత త్వరగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని వైద్యుల సంఘం (FAIMA) విజ్ఞప్తి చేసింది.

NEET CBT Exam | కొనసాగుతున్న సీబీఐ విచారణ..

మరోవైపు, నీట్ అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితులైన రాజస్థాన్‌కు చెందిన బీవాల్ కుటుంబ సభ్యులకు పాలిగ్రాఫ్, లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలనే పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆగస్టు 10కి రిజర్వ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఈ ప్రతిపాదనలపై పిటిషనర్లు తమ స్పందనలు తెలపాలని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి:  DIET Deputation | ‘డైట్​ డిప్యుటేషన్ల’లో అక్రమాలు.. అభ్యర్థుల ఆందోళన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *