PD Act | రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు

జిల్లాలో ప్రజలను బెదిరించి బలవంతపు వసూళ్లు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పోలీసులు కఠినచర్యలు తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: PD Act | జిల్లాలో ప్రజలను బెదిరించి బలవంతపు వసూళ్లు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పోలీసులు (Kamareddy Police) కఠినచర్యలు తీసుకున్నారు. సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామానికి చెందిన కాట్యాడ బాపురావుపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) పీడీయాక్ట్​ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

PD Act | దేవునిపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో..

నిందితుడు గతంలోనూ పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల దేవునిపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో దోపిడీ కేసు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎక్స్‌టార్షన్, క్రిమినల్ బెదిరింపు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, దోపిడీలకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్నాడనే కారణంతో అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం న్యాయ నిర్బంధంలో ఉన్న బాపురావును నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉంచారు.

PD Act | ఏడాది పాటు జైలులోనే..

కలెక్టర్ జారీ చేసిన డిటెన్షన్ ఉత్తర్వులను అధికారులు జైలు అధికారులకు అందజేశారు. దీంతో అతడు ఏడాది పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే దోపిడీలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై సాధారణ చట్టాలతో పాటు పీడీ యాక్ట్‌ను కూడా కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తులపై రాజీలేని చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Kamareddy Police Sports

ఇది కూడా చదవండి : India Palm Oil Production | పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా ఆంక్షలు.. భారత్‌ స్వయం సమృద్ధికి సువర్ణావకాశం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *