అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vasavi Matha Jayanti | వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతిని నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుక్ల పక్ష దశమిని పురస్కరించుకుని ఉత్సవాలను జరిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సాయాగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, వాసవీ మాత కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాల వేశారు.
Vasavi Matha Jayanti | ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతియేటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అన్నివర్గాల వారి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. కన్యకా పరమేశ్వరి మాత దేహ త్యాగం ద్వారా సహనం, శాంతిని ప్రబోధించారని, స్త్రీ శక్తి ఔన్యత్యాన్ని చాటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, వాసవీ క్లబ్ ప్రతినిధులు, వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి..: Vasavi Idol Procession | నగరంలో భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకాపరమేశ్వరి విగ్రహ ఊరేగింపు

