Kondapalli Ganesh Fraud | గణేష్ లడ్డూ పంచాడు.. పరిచయాలు పెంచుకున్నాడు.. కోట్లకు టోకరా వేశాడు.. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్

ఓ దంపతులు రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టారని, లాభాల గురించి అడిగితే మొదట వాయిదాలు వేస్తూ, తర్వాత ఫోన్లకు స్పందించడం మానేశాడని పోస్టుల్లో పేర్కొంటున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kondapalli Ganesh Fraud | హైదరాబాద్‌లో గణేష్ Ganesh లడ్డూ Laddu వేలంలో భారీ మొత్తం వెచ్చించి వార్తల్లో నిలిచిన ఓ వ్యక్తిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చ సాగుతోంది.

గణేష్ లడ్డూ పేరుతో పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత పెట్టుబడుల పేరుతో పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Kavitha’s BC Slogan | బీసీ నినాదం.. అవకాశవాద రాజకీయాల ఓటు బ్యాంక్ గేమ్!

Kondapalli Ganesh Fraud | నెలకు 6 శాతం లాభం వస్తుందంటూ..

వైరల్ పోస్టుల ప్రకారం.. మైహోం భూజా నివాసితులకు లడ్డూలు పంచుతూ పరిచయాలు పెంచుకున్న అనంతరం, నెలకు 6 శాతం లాభం వస్తుందని నమ్మించి పెట్టుబడులు పెట్టించాడని ఆరోపిస్తున్నారు.

ఓ దంపతులు రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టారని, లాభాల గురించి అడిగితే మొదట వాయిదాలు వేస్తూ, తర్వాత ఫోన్లకు స్పందించడం మానేశాడని పోస్టుల్లో పేర్కొంటున్నారు.

ఇదే తరహాలో ఐదుగురు నుంచి సుమారు రూ.3.45 కోట్లు వసూలు చేశాడని, రిటైర్డ్ ఉద్యోగుల జీవితకాల పొదుపులు కూడా ఈ వ్యవహారంలో చిక్కుకున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారని కూడా వైరల్ సందేశాల్లో పేర్కొంటున్నారు.

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *