అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 15 రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం, రాత్రిపూట అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దాపల్లిలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో చాలా వరకు పొడిగా, ఎండగా ఉంటుంది, అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.
Telangana Rain Alert | కృష్ణానదికి తగ్గిన వరద
స్థానికంగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో గత 15 రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణానది శాంతించింది. కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో కృష్ణమ్మకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసి వేశారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గడంతో ఈరోజు అన్ని స్పిల్‌వే గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జూరాలకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 39,608 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సైతం ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుం 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 50 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 178 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
దీనిని కూడా చదవండి : UPI Payments Free | కేంద్రం గుడ్‌న్యూస్.. యూపీఐ పేమెంట్లు ఉచితమే