అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | కామారెడ్డి పట్టణంలో కుటుంబ కలహాలతో భర్తను భార్య హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరి మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
కామారెడ్డి పట్టణంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇది ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ కేసుల పలు విషయాలు బయటకు వచ్చాయి. శనివారం రాత్రి.. నాన్ వెజ్ ఎందుకు వండలేదని అడిగిన పాపానికి భర్తను కొడవలితో నరికి హత్య చేసినట్లు సమాచారం.
Kamareddy murder case | భార్యభర్తల మధ్య గొడవ
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో కోదండ శివాజీ-లక్ష్మీ దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రోజువారీ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి రెండేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య వంట విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నాన్ వెజ్ ఎందుకు వండలేదని శివాజీ ప్రశ్నించగా.. చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో లక్ష్మి కొడవలితో భర్త మెడపై దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Murder Case | కామారెడ్డిలో దారుణం.. భర్త ప్రాణం తీసిన కుటుంబ కలహాలు!


[…] తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ(Kamareddy) సీఐ నరహరి(CI Narahari) మీడియాకు వివరాలు […]