Mamata Banerjee Convoy | చోర్.. చోర్ అంటూ నినాదాలు.. మమతా బెనర్జీ వాహనంపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర పరిణామం ఎదురైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee Convoy | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బీజ్‌పూర్ పరిధిలో లాకప్‌లో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆమె కాన్వాయ్‌పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు ‘చోర్.. చోర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె వాహనంపైకి రాళ్లు, పాదరక్షలు, నీళ్ల బాటిళ్లు, బురదను విసిరారు. దొరికిన వస్తువులతో ఒక్కసారిగా వాహనంపై దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Mamata Banerjee Convoy | తల పగిలిపోయేదని..

ఈ ఘటనపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడే చూస్తుండగానే అసాంఘిక శక్తులు తన కారుపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశాయని ఆరోపించారు. ఈ దాడి ఏ స్థాయిలో జరిగిందంటే.. ఒకవేళ తాను కారు అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని, ప్రాణాలు కోల్పోయి ఉండేదామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక పోలీసుల నిర్లక్ష్యంతో పాటు ప్రత్యర్థి పార్టీల ప్రమేయం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

 

ఇది కూడా చదవండి:  Plane Crash | కూలిపోయిన శిక్షణ విమానం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *