CaptiveCrunch Attack | హోటళ్లలో ఉచిత వైఫైతో డేటా చోరీ.. యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవాళ్లు, హోటళ్లలో వసతి పొందేవాళ్లను టార్గెట్ చేస్తూ భారీ సైబర్ దాడులు జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CaptiveCrunch Attack | ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవాళ్లు, హోటళ్లలో వసతి పొందేవాళ్లను టార్గెట్ చేస్తూ భారీ సైబర్ దాడులు జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం గట్టి హెచ్చరిక జారీ చేసింది. పబ్లిక్ అలాగే హోటళ్ల వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న ఈ ఇంటర్నెట్ హైజాకింగ్ దాడికి ‘క్యాప్టివ్‌క్రంచ్’ (CaptiveCrunch) అని పేరుపెట్టారు. ఈ ప్రమాదకరమైన హ్యాకింగ్ వెనుక రష్యాకు చెందిన ‘మిడ్‌నైట్ బ్లిజార్డ్’ (స్టార్మ్-2945) అనే హ్యాకింగ్ గ్రూప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

CaptiveCrunch Attack | స్క్రీన్, ఆడియో రికార్డింగ్ ప్రమాదం..

ఈ సైబర్ దాడులు చాలా ప్రమాదకరంగా మారాయని మైక్రోసాఫ్ట్ ( Microsoft )తెలిపింది. హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, కాన్ఫరెన్స్ సెంటర్లలో ఉచిత వైఫైకి కనెక్ట్ అవగానే హ్యాకర్లు ఆ డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించగానే యూజర్ స్క్రీన్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో సంభాషణలను వినడం, స్క్రీన్‌షాట్లు తీయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా, కీబోర్డ్‌పై టైప్ చేసే ప్రతి అక్షరం, బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ వివరాలు నేరుగా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయి.

CaptiveCrunch Attack | నకిలీ నోటిఫికేషన్లతో మోసాలు..

బ్రౌజర్ అప్‌డేట్ చేయండి, విండోస్ సెక్యూరిటీ స్కాన్ చేయండి లేదా గూగుల్ సెక్యూరిటీ చెక్ పూర్తయింది అంటూ నకిలీ పాప్-అప్‌లను చూపించి, యూజర్ల చేత హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఒకసారి ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తే.. కీబోర్డ్ టైపింగ్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో రికార్డింగ్, పాస్‌వర్డ్‌లు , బ్రౌజర్ కుకీలను దొంగిలించడంతో పాటు కంప్యూటర్‌ను రిమోట్‌గా ఆపరేట్ చేసే పూర్తి అధికారాన్ని హ్యాకర్లు పొందుతారు.

CaptiveCrunch Attack | తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వీలైనంత వరకు హోటళ్లు , పబ్లిక్ ప్రదేశాల్లోని ఉచిత వైఫైని ఉపయోగించకపోవడం మంచిది. పబ్లిక్ నెట్‌వర్క్‌లకు బదులుగా వ్యక్తిగత మొబైల్ హాట్‌స్పాట్ లేదా ఎన్‌క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్‌లను వాడాలి. బ్రౌజింగ్ చేసే సమయంలో వచ్చే అనుమానాస్పద పాప్-అప్ నోటిఫికేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లలో సున్నితమైన కార్పొరేట్ సమాచారాన్ని, బ్యాంకింగ్ ఖాతా వివరాలను ఎంటర్ చేయవద్దని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి:  Hyderabad car accident | హైదరాబాద్​లో కారు బీభత్సం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *