అక్షరటుడే,మెండోరా: Sriramsagar Water Storage | మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) (Sriramsagar Project) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టు (babli) గేట్లు తెరవడం, వర్షాల కారణంగా కూడా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పేర్కొన్నారు.
Sriramsagar Water Storage | 7,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో..
ప్రస్తుతం శ్రీరాంసాగర్ (Pochampad) ప్రాజెక్టులోకి 7,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,078.90 అడుగుల వద్ద 42.116 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,078.70 అడుగుల వద్ద 41.698 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే సుమారు 0.4 టీఎంసీల మేర అధికంగా నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు కలిపి మొత్తం 993 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.