అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది.
ఎగువన ప్రాజెక్టుల గేట్లు మూసివేయడంతో శ్రీశైలంకు ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుతం జలాశయానికి 51,016 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 44,928 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు నాగర్జున సాగర్‌కు వెళ్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిరంతర విద్యుత్ ఉత్పత్తి కారణంగా శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) జలాశయం నిల్వ గణనీయంగా పెరగడం లేదు.
Srisailam Project Flood | ఆల్మట్టికి పెరిగిన ఇన్‌ఫ్లో
కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం ఇన్‌ఫ్లో పెరిగింది. 80 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో దిగువకు నీటి విడుదలను 42 వేల క్యూసెక్కుల నుంచి 75 వేల క్యూసెక్కులకు పెంచారు. జలాశయం సామర్థ్యం 123 టీఎంసీలు కాగా 121 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరద పెరిగే అవకాశం ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Weather | నేడు రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన