అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Couple Suicide | ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని (Nizamabad) నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
Nizamabad Couple Suicide | విద్యుత్ శాఖలో పని చేస్తూ..
నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో నివాసముండే శేషాల నరేష్, మేఘన దంపతులను కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నరేష్ విద్యుత్‌శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మానసిక ఒత్తిడిలో (Health Issues) ఉండడంతో నరేష్ కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అప్పులు పెరిగిపోవడం.. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోనే మేఘన పురుగుల మందు తాగగా, నరేష్ ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Nizamabad Couple Suicide | సూసైడ్ నోట్ రాసి..
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు నరేష్ ఇంట్లో సూసైడ్ నోట్ సైతం లభించింది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆర్థిక ఇబ్బందులు మానసిక సమస్యలే వీరి ఆత్మహత్యలకు కారణమని వారి కుటుంబ సభ్యులు బున్ని మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Cheyutha Pension Scheme | తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త ఆసరా పింఛన్లకు రంగం సిద్ధం