Aug 12 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 12 Market Analysis | పశ్చిమాసియా(West Asia )లో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, టెక్నాలజీ స్టాక్స్‌లో బలహీనత కారణంగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో యూఎస్(US) బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాల బాటలో సాగాయి.

యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా ఈక్విటీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Aug 12 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

యూఎస్ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్‌లోనూ పడిపోయింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.60 శాతం, ఎస్ అండ్ పీ 0.32 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం నష్టంతో ఉంది.

Aug 12 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.17 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.13 శాతం నష్టపోగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.26 శాతం పెరిగాయి.

Aug 12 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 3.66 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.66 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.13 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.06 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.07 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ ఆతిథ్యం

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 258.55 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 24.77 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలహీనపడి 95.44 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.85 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.69 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 89.37 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.99 నుంచి 1.00 కు పెరిగింది.
  • విక్స్ 3.18 శాతం తగ్గి 11.85 వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *