Indiramma Houses | జోరుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.. క్షేత్రస్థాయిలో సాగని నిర్మాణాలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గాంధారి మండలంలో నిర్మాణాలు ముందుకు సాగకపోవడంపై అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే, గాంధారి : Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక నుంచి అధికారుల పర్యవేక్షణ వరకు యాప్​ ద్వారా మానిటరింగ్​ చేస్తోంది. అయితే గాంధారి మండలంలో నిర్మాణాలు ముందుకు సాగకపోవడంపై అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Indiramma Houses | గాంధారి మండలంలో..

గాంధారి మండలం (Gandhari Mandal)లో రెండు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశారు. మొదటి విడతలో 585 ఇళ్లు.. రెండోవిడతలో 186 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేసి ఏడాది గడుస్తున్నా చాలావరకు ఇళ్లు ప్రారంభదశలోనే ఉండడం గమనార్హం. మొత్తంగా 771 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేయగా.. కేవలం 80మంది మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేశారు. అయితే ఇందులో 220 ఇందిరమ్మ ఇళ్లు స్లాబ్ లెవల్​లో ఉండగా మిగతా 471 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

Indiramma Houses | లేబర్లు దొరకక ఇబ్బందులు

ఇందులో లబ్ధిదారులు కొంత పెట్టుబడి పెట్టి ఇళ్లు ప్రారంభించారు. మరికొందరికి డబ్బుల అందకపోవడంతో కొన్ని నిర్మాణాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అలాగే కొన్ని ఇళ్లు మేస్త్రీల దొరకకపోవడంతో నిలిచిపోయాయి. దాదాపు 800 వరకు మంజూరైన ఇళ్లలో 80 మాత్రమే గృహప్రవేశం వరకు వెళ్లాయి. ప్రభుత్వం ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ వరకు రూ.లక్ష, గోడలు పూర్తయితే రూ.లక్ష, స్లాబ్ వర్క్ అయితే మరో రూ.లక్ష, కలర్ పెయింట్లు పూర్తిగా వేస్తే రూ.లక్ష ఇలా విడతలుగా ఇస్తోంది. ఈజీఎస్ పథకం ద్వారా రూ.14 వేలు బాత్​రూం నిర్మాణానికి ఇస్తుంది.

Indiramma Houses | జాప్యం లేకుండా పనులు పూర్తి చేయించాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు తానాజీ రావు అన్నారు. మొత్తంగా గాంధారిలో సుమారు 800 ఇళ్లు మంజూరవ్వగా కేవలం 80 మాత్రమే పూర్తవ్వడం అధికారుల జాప్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అర్హులైన ప్రతిఒక్కరి ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంంది.

Indiramma Houses | పూర్తి అవగాహన కల్పిస్తున్నాం

– రాజేశ్వర్, ఎంపీడీవో గాంధారి

ఇందిరమ్మ ఇళ్లపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకున్నట్లుగా వారి ఖాతాల్లో నిధులు జమ అయిపోతున్నాయి. కాకపోతే నిర్మాణక్రమంలో లబ్ధిదారులు జాప్యం చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షం కూడా కారణంగా చెప్పవచ్చు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

ఇది కూడా చదవండి: Sarpanch Husband Interference | ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ భర్త జోక్యమెందుకు..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *