అక్షరటుడే, నిజామాబాద్సిటీ: 108 Nizamabad | నిజామాబాద్ జిల్లాలో వరుసగా నవజాత శిశువులను వదిలించుకుంటున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి.
వారంరోజుల క్రితం జీజీహెచ్ డ్రెనేజీలో నవజాత శిశువు మృతదేహం లభించగా.. తాజాగా బుధవారం ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, స్పందించిన 108 సిబ్బంది శిశువును అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటన మోపాల్ (Mopal) మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
108 Nizamabad | మోపాల్–సిర్పూర్ మధ్యలో..
మోపాల్–సిర్పూర్ గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో నవజాత శిశువు ఏడుపు వినిపించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆడ శిశువును అక్కున చేర్చుకుని జిల్లా ఆస్పత్రికి (GGH Nizamabad) తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రెండురోజుల క్రితం జన్మించినట్లుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని జిల్లా ఇన్ఛార్జి జనార్ధన్ అభినందించారు.
ఇది కూడా చదవండి: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్