Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..

ఎగువన వర్షాలు తగ్గడంతో జూరాలకు ఇన్​ఫ్లో తగ్గుముఖం పట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jurala Project Flood | ఎగువన కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కృష్ణనది పరివాహక ప్రాంతంలో వానలు తగ్గడంతో జూరాల ప్రాజెక్ట్​కు వరద తగ్గింది.

జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District)లోని జూరాల ప్రాజెక్ట్​కు ప్రస్తుతం 28 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో గేట్ల ద్వారా నీటివిడుదలను అధికారులు నిలిపివేశారు. విద్యుత్​ ఉత్పత్తి, ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో 10 యూనిట్లతో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.

Jurala Project Flood | 185 టీఎంసీలకు చేరిన శ్రీశైలం

జూరాల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం 51,296 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా గురువారినికి 26,939 క్యూసెక్కులకు తగ్గింది. సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తుండటంతో, అవుట్​ ఫ్లో 71,176 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 185.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 30 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్ట్​ నిండుకుండలా మారనుంది.కృష్ణా నదిపై కర్ణాటకలోని జలాశయాలు నిండాయి. తెలంగాణలోని జూరాల సైతం నిండుకుండలా మారింది. మరికొన్ని రోజులు వరద వస్తే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నాగర్జున సాగర్​కు మాత్రం వరద రావడం లేదు. శ్రీశైలం గేట్లు ఎత్తితే సాగర్​కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలి : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *